సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (20:10 IST)

'మహర్షి' మూవీ అప్‌డేట్స్ :: తీపి కబురు.. చేదువార్త... ఫ్యాన్స్ షాక్

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలకానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
అయితే, ఈ చిత్రం నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ సినిమాకు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. ఈ వార్త అటు చిత్ర యూనిట్‌తో పాటు మహేష్ ఫ్యాన్స్‌కు శుభవార్త. 
 
మరోవైపు, చేదు వార్త కూడా వచ్చింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం కావడంతో ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ నగరంలో టికెట్ల రేట్లను 2 వారాల పాటు పెంచుకునేందుకు సమ్మతించింది. 
 
అదే అదునుగా భావించిన థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ ధరలను ఇష్టరాజ్యంగా పెంచేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80గా ఉన్న టికెట్ ధరను రూ.110కి పెంచారు. అలాగే, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్ మీద రూ.50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రసాద్ ఐమ్యాక్స్ అయితే రూ.138గా టికెట్ రేటును ఏకంగా రూ.200 చేసేసింది. దీన్ని మహేష్ ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.