సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 6 మే 2019 (16:25 IST)

షాక్... మహేష్ 'మహర్షి' చిత్రాన్ని మా థియేటర్లలో వేయడంలేదు... ఎందుకని?

అసలే మే నెల సెంటిమెంటుతో ప్రిన్స్ మహేష్ బాబు భయపడిపోతుంటే ఓ ప్రముఖ థియేటర్ యాజమాన్యం మహేష్ బాబు మహర్షి చిత్రాన్ని మే 9న వేయడంలేదంటూ తెలిపి షాక్ ఇచ్చింది. చెన్నైకు చెందిన జి.కె సినిమాస్ ఎమ్.డి రూబన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల సహకారం కొరవడిందనీ, సరైన పద్ధతిలో వారు తమను సంప్రదించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
 
కాగా చెన్నైలో వేకువ జామున 5 గంటలకే మహేష్ బాబు మహర్షి చిత్రం విడుదలవుతుంది. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం తమిళనాడులో ఇలా విడుదలవడం విశేషం. ఐతే ప్రముఖ థియేటర్లలో చిత్రం ప్రదర్శించకపోతే నిర్మాతలకు నష్టమే మరి. మరోవైపు అభిమానులకు కూడా ఇది నిరాశపరిచే విషయమే. మరి నిర్మాతలు ఏమయినా దీనిపై నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.