సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఏప్రియల్ 2018 (15:27 IST)

అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానంది.. మైలారం రైల్వేస్టేషన్ వద్ద?

అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు శివార్లలోని లింగంపల్లిలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి మృతదేహం మైలార

అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు శివార్లలోని లింగంపల్లిలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి మృతదేహం మైలారం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు గమనించారు. ఆదివారం తాండూరులోని తన అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానని బయల్దేరింది.
 
అయితే ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? లేక రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కుమార్తెపై అత్యాచారం జరిపి హత్య చేశారని జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.