1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Hyderabad devotee donates Rs 10 crore to TTD

టీటీడీకి రూ.10 కోట్లు విరాళం అందించిన హైదరాబాద్ భక్తుడు

Hyderabad devotee donates Rs 10 crore to TTD
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మరో భారీ విరాళం సమర్పించుకున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన భక్తుడు. దీనికి సంబంధించి తితిదే ఓ ప్రకటనలో తెలియజేస్తూ... హైదరాబాద్‌కు చెందిన శ్రీ కొడాలి శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 కోట్లు విరాళంగా అందించారు.
 
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
నువ్వు గొడ్రాలివే అంటూ నిత్యం వేధిస్తున్న భర్త... కత్తితో నరికి చంపేసిన భార్య