అయోధ్య రాముడి విరాళాలు బొక్కేసింది ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు: అసద్
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విరాళాల్లో జరిగిన అవకతవకలపై ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ... విరాళాల అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదు. ప్రజల విశ్వాసాన్ని అపహాస్యం చేయడంతో వారు ఆగ్రహంగా వున్నారు, కనుక ఏం జరిగిందన్నది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నివేదికలోని పూర్తి విషయాలను తక్షణమే బైటపెట్టాలి.
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించింది ప్రభుత్వమే కదా. అంతకుముందు ట్రస్టును ఏర్పాటు చేసింది కూడా ప్రభుత్వమే కదా. పార్లమెంటులో బిల్లు పెట్టి మరీ ఆమోదించారు.
ఇంతచేసిన తర్వాత కోట్లాది రూపాయలు దొంగతనానికి గురయ్యాయి. ఆ దొంగతనం ఎవరు చేసారన్నది ప్రజలు తెలుసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. వారిని ప్రజల ముందు నిలబెట్టరా. నమ్మకం పేరుతో ఓట్లు, అధికారం సంపాందించి కొంతమంది చేతికి అందినకాడికి దోచుకుంటున్నారు. అందుకే ఇప్పటికైనా నివేదికలోని పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు పెడితే విశ్వాసం కలుగుతుంది అని అన్నారు.
Govt mocking public's faith while appointed people indulged in rampant looting.”
— Shakeel Yasar Ullah (@yasarullah) September 3, 2026
- AIMIM Chief Asaduddin Owaisi on new Ram temple trust CEO pic.twitter.com/UsqoNXnj5u
