గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (09:24 IST)

ప్రేమ పేరుతో వంచించాడు.. పెళ్లి చేసుకోనన్నాడు.. కోర్టు కెళ్లేసరికి.. రేప్ చేశాడు..

ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లనేసరికి ముఖం చాటేశాడు. దీనిపై విచారణ కోర్టులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు వాయిదాకు వచ్చిన నిందితుడు తాను బాధితురాలితో ఏదో మాట్లాడాలని చెప్పి ఇంటికెళ్లాడు. అక్కడ బాధితురా

ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లనేసరికి ముఖం చాటేశాడు. దీనిపై విచారణ కోర్టులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు వాయిదాకు వచ్చిన నిందితుడు తాను బాధితురాలితో ఏదో మాట్లాడాలని చెప్పి ఇంటికెళ్లాడు. అక్కడ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదు బోడుప్పల్‌లోని హేమానగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి‌ వెళితే.. బోడుప్పల్‌, హేమానగర్‌‌కు చెందిన యువతి (30), కామారెడ్డి జిల్లాకు చెందిన ఇర్ఫాన్‌ (35)లు హైదరాబాదులోని జెన్‌ ప్యాక్ట్‌‌లో సహోద్యోగులు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. 
 
కానీ పెళ్లి మాటెత్తే సరికి.. యువతికి కామారెడ్డి ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయిన విషయాన్ని లేటుగా గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో 2016లో ఇర్ఫాన్‌పై మోసం, వంచన వంటి సెక్షన్లపై కేసు నమోదైంది. 
 
ఈ కేసు వాయిదాలు నడుస్తుండగా.. శనివారం వారిద్దరూ కోర్టు వాయిదాకు హాజరయ్యారు. ఆపై యువతితో మాట్లాడాలని ఆమె ఇంటికెళ్లిన ఇర్ఫాన్.. అక్కడే ఆమపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు మళ్లీ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతోంది.