1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Hyderabad : tv actor turn as thief

ఘరానా దొంగగా మారిన బుల్లితెర నటుడు

బుల్లితెరపై అవకాశాలు లభించకపోవడంతో ఓ నటుడు ఘరానా దొంగగా మారిపోయాడు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. అతని నుంచి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వా

Hyderabad
బుల్లితెరపై అవకాశాలు లభించకపోవడంతో ఓ నటుడు ఘరానా దొంగగా మారిపోయాడు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. అతని నుంచి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
సూర్యాపేటజిల్లా హుజూర్‌నగర్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన బర్రి నాగరాజు అలియాస్‌ నరేందర్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ అలియాస్‌ గుంటూరు నరేంద్ర(23) వృత్తిరీత్యా కార్పెంటర్‌. సినిమాలో నటించాలనే కోరికతో హైదరాబాద్‌ వచ్చి జూబ్లీహిల్స్‌లోని ఇందిరానగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఉంటున్నాడు. ఓ ప్రైవేట్‌ తెలుగు టీవీ సీరియల్‌లో చిన్నచిన్న క్యారెక్టర్‌లు వేస్తున్నాడు. జూదం, సిగరెట్‌, మద్యానికి బానిసయ్యాడు. తన వ్యసనాలను తీర్చుకోవడం కోసం దొంగతనాల దారిని ఎంచుకున్నాడు.
 
ఇందుకోసం ముందుగా తాను దొంగతనాలు చేసేందుకు రెక్కీ నిర్వహించేవాడు. ముఖ్యంగా, నగరంలోని చైతన్యపురి, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లోని ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటాడు. ముందుగా ఆయా కాలనీలో రెక్కీ నిర్వహించి, పథకం ప్రకారం.. రాత్రిపూట కటింగ్‌ప్లేర్‌, స్ర్కూడ్రైవర్‌ను తీసుకెళ్లి ఇంటి తాళాలను విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారం, డబ్బు దొరికినకాడికి దోచుకొని పారిపోతాడు. ఇలా 2016 నుంచి ఇప్పటి వరకు చైతన్యపురి పోలీస్టేషన్‌ పరిధిలో 16, సరూర్‌నగర్‌ పరిధిలో ఒకటి, మొత్తం17 ఇళ్ళలో దోపిడీ చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. తాజాగా ఓ ఇంట్లో దోపిడీ చేస్తూ అడ్డంగా పోలీసులకు చిక్కాడు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కాంగ్రెస్‌కు జుకర్‌బర్గ్ సారీ... 'డేటా లీక్‌ స్కాంకు నాదే పూర్తి బాధ్యత'