శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (14:25 IST)

నన్ను వాడుకోవడం వాళ్ల హక్కా? ప్రశ్నిస్తున్న నటి

ఇటీవల అర్థనగ్న ప్రదర్శనతో వార్తల్లోకెక్కిన తెలుగు నటి శ్రీరెడ్డి. ఆమె వైఖరిని ప్రతిఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం కల్పించాలని, తెలుగు చిత్రాల్లో 75 శాతం తెలుగు

ఇటీవల అర్థనగ్న ప్రదర్శనతో వార్తల్లోకెక్కిన తెలుగు నటి శ్రీరెడ్డి. ఆమె వైఖరిని ప్రతిఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం కల్పించాలని, తెలుగు చిత్రాల్లో 75 శాతం తెలుగు నటీనటులనే ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేస్తూ అర్థనగ్న ప్రదర్శనకు దిగిన విషయం తెల్సిందే. అయితే, ఆమె చర్యను పలువురు ఖండించారు. 
 
దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ, 'ప్రేమ, పెళ్లి అంటూ నన్ను ఓ వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేసి మోసం చేశాడు. పెళ్లి గురించి ప్రశ్నించేసరికి నీ స్థాయి ఏంటి? నీ జాతి ఏంటి.. నువ్వేంటి? నీ కుటుంబమేంటి? మా తాత ఏంటి, మా బాబేంటి? అని ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడాడు. కొన్నేళ్లుగా మేం పరిశ్రమను ఏలుతున్నాం. మా అబ్బాయిని వలలో వేసుకుని, మా కుటుంబం మీద కన్నేసి, కోడలు అయ్యి ఆస్తి కొట్టేద్దామనుకుంటున్నావా? నీ పని నువ్వు చూసుకో. సినిమా నిర్మాతలుగా ఉన్నాం కాబట్టి మా దగ్గరకు చాలామంది అమ్మాయిలు వస్తారు. వాడుకోవడం మా హక్కు' అని వ్యాఖ్యానించారు. 
 
ఇలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. వీరందరికీ నన్ను వాడుకుని వదిలివేయడం వీరి హక్కా అని ఆమె ప్రశ్నించారు. ఎదురించేవారు ఎవరూ లేరనుకుంటున్నారు. ప్రశ్నించలేని చాలామంది డిప్రెషన్‌లో ఆత్మహత్యలు చేసుకున్నారు. మానసికంగా క్షోబించి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని 'మా' అసోసియేషన్‌ వాళ్లూ అనుకున్నారేమో. నేను అలాంటి వాటిని భయపడను. సమస్య పరిష్కారం కోసం తన వంతు పోరాటం చేస్తానని చెప్పారు.
 
అంతేకాకుండా, అర్థనగ్న ప్రదర్శన తర్వాత తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయని వాపోయింది 'ఐదేళ్లగా నేను ఒకే ఇంట్లో ఉంటున్నా. ఇప్పటి వరకూ నాకు వాళ్లతో ఎలాంటి ఇబ్బంది లేదు. శనివారం జరిగిన ఘటన వల్ల హౌస్‌ ఓనర్స్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఆయనొక ఐ.ఎ.ఎస్‌ ఆఫీసర్‌ అయి ఉండి కూడా ఆ బెదిరింపులకు భయపడి తక్షణమే నన్ను ఇల్లు ఖాళీ చెయ్యమంటున్నారు. నేనెక్కడికి వెళ్లాలి? ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నేను ఎలా బతకాలి' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.