1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Hyderabad : woman illegal affair

దెయ్యం పట్టినట్టు నటిస్తూ.. భర్త కళ్ళుగప్పి యువకుడితో శృంగారం...

ఓ వివాహిత దెయ్యం పట్టినట్టుగా నటించి భర్త కళ్లుగప్పి.. మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని పోలీసుల సహాయంతో భర్త కనిపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.

Hyderabad
ఓ వివాహిత దెయ్యం పట్టినట్టుగా నటించి భర్త కళ్లుగప్పి.. మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని పోలీసుల సహాయంతో భర్త కనిపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ వ్యక్తికి గత యేడాది ఏప్రిల్ నెలలో ఓ మహిళతో వివాహమైంది. ఆ తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి తన భార్యతో పాటు వచ్చాడు. నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. అయితే వివాహం అయినప్పటి నుంచి అతడి భార్య దెయ్యం పట్టిన దానిలా ప్రవర్తించసాగింది. 
 
దీంతో భర్త ఓ భూత వైద్యుడిని ఆశ్రయించి వైద్యం చేయసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన భాగ్యనగరంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్తూవెళ్తూ తన వెంట ఫోన్ తీసుకెళ్లింది. 
 
తన భార్య ఇంట్లో లేకపోవడంతో ఇరుగు పొరుగువారి వద్ద విచారించగా తమకు తెలియదని సమాచారం ఇచ్చారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా ట్రేస్ చేయగా, ఆమె గణేశ్ రెడ్డితో ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు గణేష్‌ రెడ్డిపై 497 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎరుపు రంగు పైట.. తలలో పూలు... హిజ్రా వేషంలో... మోడీ బావా అంటూ పిలుపు