మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (13:54 IST)

పడక గదిలో ప్రియుడితో నగ్నంగా భార్య.. చూసిన భర్తకు విషమిచ్చి...

వివాహేతర సంబంధం ఫలితంగా భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగరంలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తకు విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిరోజాబాద్ నగరంలోని చార్‌బాగ్ ప్రాంతానికి చెందిన సోమిఖ్ లాల్ (42), నేక్సీదేవీలు భార్యాభర్తలు. నేక్సీదేవికి అదే ప్రాంతానికి చెందిన సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఆ తర్వాత నేక్సీదేవి తన ప్రియుడితో కలిసి పడకగదిలో ఉండగా భర్త సోమిఖ్ లాల్ చూసి, గ్రామస్తులకు చెబుతానని హెచ్చరించాడు. దీంతో నేక్సీదేవి తన ప్రియుడైన సంజయ్ సింగ్‌తో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. 
 
తమ ప్రాంతంలో భాగంగా భర్త సోమిఖ్ లాల్‌కు విషం కలిపిన పానీయం ఇచ్చింది. భర్త లాల్ మరణించాక ఎవరికీ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అతను గుండెపోటుతో మరణించాడని నమ్మించి ఆస్పత్రికి తరలించింది. 
 
అయితే, సోమిఖ్ లాల్ కుమారుడు తల్లిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఇందులో విషమిచ్చి చంపినట్టు తేలింది. దీంతో పరారీలో ఉన్న నేక్సీదేవితో పాటు.. ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.