ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 9 ఆగస్టు 2018 (20:58 IST)

పెంట్ హౌజ్ ప్రియుడితోనే భర్తను హత్య చేసిన భార్య... వాటిని పిసికేసింది...

తాగొచ్చిన భర్త వేధింపులు తాళలేక నోట్లో హిట్ కొట్టి చంపేసినట్లు బాణోతు జగన్ నాయక్ భార్య చెప్పినదంతా అబద్ధమని ఆమె పిల్లల ద్వారానే తెలిసిపోయింది. ఆమె చెప్పినదంతా అబద్ధమనీ, అసలు కారణం వివాహేతర సంబంధమనీ వెల్లడైంది. అసలు విషయం ఏంటంటే... దేవిక రెండేళ్ల క్రి

తాగొచ్చిన భర్త వేధింపులు తాళలేక నోట్లో హిట్ కొట్టి చంపేసినట్లు బాణోతు జగన్ నాయక్ భార్య చెప్పినదంతా అబద్ధమని ఆమె పిల్లల ద్వారానే తెలిసిపోయింది. ఆమె చెప్పినదంతా అబద్ధమనీ, అసలు కారణం వివాహేతర సంబంధమనీ వెల్లడైంది. అసలు విషయం ఏంటంటే... దేవిక రెండేళ్ల క్రితం ఫిల్మ్‌నగర్‌లోని అడ్వాన్స్‌ బీపీఓ సంస్థలో హౌజ్‌ కీపింగ్‌ ఉద్యోగిగా విధుల్లో చేరింది. అక్కడ తోట బెనర్జీ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం కాస్తా భర్త జగన్‌కు తెలిసి భార్యతో గొడవపడ్డాడు. 
 
బెనర్జీతో సంబంధాన్ని వదిలి బుద్ధిగా వుండాలని హెచ్చరించాడు. కానీ దేవిక మాత్రం బెనర్జీని వదలిపెట్టలేదు. పైగా బెనర్జీతో ఓ ముందడుగు వేసి తనను పెళ్లి చేసుకుంటానంటూ తన తల్లిదండ్రుల వద్ద చెప్పమని కోరింది. దేవిక చెప్పినట్లే బెనర్జీ ఆమె తల్లిదండ్రులతో విషయాన్ని చెప్పాడు. ఐతే దీనిపై దేవిక పేరెంట్స్ మండిపడ్డారు. దేవిక సోదరులు బెనర్జీ ఇంటికి వెళ్లి అతడిని చితక్కొట్టారు. మరోసారి దేవికతో కనబడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించి వెళ్లారు. కానీ దేవిక-బెనర్జీల సంబంధం మాత్రం అలాగే కొనసాగింది. 
 
ఆమె ఉద్యోగం మానుకున్నప్పటికీ బెనర్జీ ఆమెను కలుస్తూనే వున్నాడు. తాము స్వేచ్ఛగా వుండాలంటే జగన్‌ను చంపడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. దీనితో దేవిక కుటుంబం వుంటున్న భవనంలోని పెంట్ హౌజ్‌లో అద్దెకు దిగాడు బెనర్జీ. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో సోమవారం నాడు జగన్ మరోసారి దేవికతో గొడవపడి పూటుగా మద్యం సేవించి మత్తులోకి జారుకున్నాడు. ఇంతలో పెంట్ హౌజులో వున్న ప్రియుడు బెనర్జీని ఇంటికి రమ్మని పిలిచింది దేవిక. ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు. 
 
అర్థరాత్రి 2 గంటల దాటాక జగన్ మెళకువ వచ్చి చూసేసరికి దేవిక-బెనర్జీ ఇద్దరూ కంటపడ్డారు. దీనితో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీదికి వెళ్లాడు. ఐతే దేవిక ఒకవైపు బెనర్జీ ఒకవైపు అతడిని గట్టిగా పట్టేశారు. బెనర్జీ అతడి ముఖంపై వంట పాత్రను పెట్టి ఊపిరాడకుండా చేశాడు. మరోవైపు దేవిక తన భర్త జగన్ వృషణాలు గట్టిగా పిసికేసింది. ఈ బాధలో ఇద్దర్నీ తోసి పైకి లేచాడు జగన్. దాంతో బొద్దింకలను చంపే హిట్ తీసుకుని అతడి ముఖంపై స్ప్రే చేసింది దేవిక. హిట్ ఘాటుతో అతడు కిందపడిపోయాడు. 
 
మరోసారి వంటపాత్రను బెనర్జీ అతడి ముఖంపై గట్టిగా ఒత్తేశాడు. జగన్ వృషణాలను గట్టిగా పట్టుకుని చిదిమేసింది దేవిక. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రియుడు బెనర్జీని టెంట్ హౌజుకు పంపిస్తున్న సమయంలో పిల్లలు చూశారు. విషయాన్ని చెప్పొద్దంటూ పిల్లలతో అన్నది కానీ... అమ్మ చెప్పవద్దంది అంటూ పిల్లలు దేవిక చెప్పిన మాటనే పోలీసులకు చెప్పడంతో డొంక కదిలింది. దేవికను అరెస్టు చేసిన పోలీసులు బెనర్జీ కోసం గాలిస్తున్నారు.