1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Anantapur : meat piece killed field asistant

అడ్డుపడిన మాంసపు ముక్క... గాల్లో కలిసిన ప్రాణాలు...

కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూ

Anantapur
కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ మండలంలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఆవులదట్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా రామాంజనేయులు (35) అనే వ్యక్తి పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూలీలంతా భోజనానికి వచ్చారు. వారితో పాటు ఈయన కూడా ఇంటికి వచ్చి భోజనం చేయసాగాడు. 
 
అపుడు ఓ మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన విలవిల్లాడి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆవులదట్ల ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏ పీవో అప్పస్వామినాయుడు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడు రా మాంజినేయులుకు భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సినిమా కోసం మృగంగా మారిన మలయాళ సూపర్‌స్టార్