శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (11:09 IST)

భర్త నోట్లో హిట్ కొట్టిన భార్య.. ఫిలిమ్ నగర్‌లో దారుణం..?

కుటుంబకలహాలతో భార్య భర్తను చంపేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బస్తీలో కొంతకాలంగా భార్య దేవిక, భర్త జగన్‌ కలిసి నివసిస్తున్నారు. ఓ రాత్రి ఫూటుగా తాగొచ్చాడు

కుటుంబకలహాలతో భార్య భర్తను చంపేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బస్తీలో కొంతకాలంగా భార్య దేవిక, భర్త జగన్‌ కలిసి నివసిస్తున్నారు. ఓ రాత్రి ఫూటుగా తాగొచ్చాడు జగన్. అంతే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే ఆవేశంలో జగన్ నోట్లో హిట్ కొట్టేసింది దేవిక. దీంతో రసాయన ప్రభావంతో జగన్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
కుటుంబకలహాలే ఈ హత్యకు కారణమైందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. రెండు నెలల క్రితమే గుంటూరు జిల్లా మాచర్ల నుండి దంపతులిద్దరూ హైదరాబాద్‌కి వచ్చారని.. పెళ్లైనప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జురుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. 
 
జగన్‌ రోజూ ఫుల్‌గా మద్యం సేవించి, దేవికను చిత్రహింసలకు గురిచేసేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వేధింపులు తాళలేక భార్య దేవిక అతడిని హతమార్చింజని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం దేవికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.