సంబంధిత వార్తలు
- కానిస్టేబుల్‌తో భార్య రొమాన్స్... గడియపెట్టి స్థానికులకు పట్టించిన ఖాకీ భర్త...
- ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తూ శృంగారంలో దించేశాడు... కువైట్ భర్త షాక్... ప్రాణ భయం...
- ప్రియుడితో భార్య రొమాన్స్... చూశాడనీ భర్త అంగాన్ని కొరికిన భార్య...
- కర్నూలులో భారీ పేలుడు... 8 మంది మృతి
- ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది... భర్త నిలదీస్తే ఏం చేసిందో తెలుసా?
అసహజ శృంగారానికి ఒత్తిడి.. కాపురానికిరాని భార్య... గొంతుకోసిన భర్త.. ఎక్కడ?
అసహజ శృంగారం చేయాలంటూ రెండో భర్త ఒత్తిడి చేయడంతో ఆ భార్య అమ్మగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త వెళ్లి కాపురానికి రావాలంటూ పలుమార్లు పిలిచినా ఆమె రాలేదు. దీంతో ఆగ్రహించిన రెండో భర్త బ్లేడుతో భార్య
అసహజ శృంగారం చేయాలంటూ రెండో భర్త ఒత్తిడి చేయడంతో ఆ భార్య అమ్మగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త వెళ్లి కాపురానికి రావాలంటూ పలుమార్లు పిలిచినా ఆమె రాలేదు. దీంతో ఆగ్రహించిన రెండో భర్త బ్లేడుతో భార్య కొంతుకోశాడు.
మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందినబోయ కవితను యాగంటిపల్లె గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు తాగుడు అలవాటు ఉంది. పైగా, భార్యను నిత్యం వేధించసాగాడు. దీంతో భర్త నుంచి విడిపోయి, కూలిపని చేసుకుంటూ జీవనం సాగించసాగింది.
ఈ క్రమంలో ఓ మధ్యవర్తి ద్వారా రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన బాలయోసు అనే వ్యక్తితో ఇద్దరికీ 10 రోజుల క్రితం వివాహం చేశారు. బాలయేసు కూడా భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు అసహజశృంగారం చేయాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దీంతో ఆమె కాపురానికి వెళ్లలేదు.
ఇదే విషయంపై పెట్రోల్‌బంకు కూడలిలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆవేశానికి గురైన భర్త బాలయేసు వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య గొంతు కోశాడు. దీన్ని చూసిన స్థానికులు బాలయేసును పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్న కవితను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
