శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (14:19 IST)

ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తూ శృంగారంలో దించేశాడు... కువైట్ భర్త షాక్... ప్రాణ భయం...

హైదరాబాద్ సంపన్నులు నివాసం ఉండే ఫిలింనగర్‌లో ఓ ఇంటికి ఫిట్నెస్ ట్రైనరుగా వచ్చి ఇంటి యజమానురాలినే వలలో వేసుకున్నాడు ఓ ట్రైనర్. గోపిశెట్టి శ్రీధర్‌ కువైట్‌లో ఉంటూ ‘టీమ్‌ వన్‌ ఇండియా’ పేరుతో బహుళజాతి కంప

హైదరాబాద్ సంపన్నులు నివాసం ఉండే ఫిలింనగర్‌లో ఓ ఇంటికి ఫిట్నెస్ ట్రైనరుగా వచ్చి ఇంటి యజమానురాలినే వలలో వేసుకున్నాడు ఓ ట్రైనర్. గోపిశెట్టి శ్రీధర్‌ కువైట్‌లో ఉంటూ ‘టీమ్‌ వన్‌ ఇండియా’ పేరుతో బహుళజాతి కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతనికి ఇద్దరు సంతానం. ఇటీవల ఆయన భార్య ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు రాకేష్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తిని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నియమించుకుంది.
 
రాకేష్‌ ప్రతిరోజూ ఉదయం రెండుగంటల పాటు వారి ఇంటికి వచ్చి వ్యాయామం చేయించేవాడు. ఇదే క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గమనించిన ఇంటి పనిమనుషులు శ్రీధర్‌‌కు సమాచారం అందించారు. శ్రీధర్‌ భార్యకూ, ఫిట్నెస్ ట్రైనర్‌కు వార్నింగ్‌ ఇచ్చినా తీరు మార్చుకోలేదు సరికదా ఇంట్లోనే మకాం పెట్టి  ఇద్దరూ కలసి సురాస్‌ అనే నిర్మాణ రంగ సంస్థను కూడా ప్రారంభించినట్లు ఆయన దృష్టికి వచ్చింది. 
 
శ్రీధర్‌ వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. తన భార్య, రాకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.