సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 3 ఆగస్టు 2018 (21:56 IST)

కర్నూలులో భారీ పేలుడు... 8 మంది మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్వారీలోని షెడ్డులో ఉన్న 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భారీగా శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. కర్నూలు ఘటనపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.