నా భర్త అలాంటోడు కాదు.. మాజీ ఎమ్మెల్యే గండ్ర భార్య...

తననువాడుకుని వదిలేశాడంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై గండ్ర భార్య స్పందించింది. తన భర్త చాలా మంచోడనీ అలాంటోడు కాదంటూ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది.

ganda venkataramana reddy
pnr| Last Updated: సోమవారం, 6 ఆగస్టు 2018 (16:13 IST)
తననువాడుకుని వదిలేశాడంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై గండ్ర భార్య స్పందించింది. తన భర్త చాలా మంచోడనీ అలాంటోడు కాదంటూ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది.
 
మరోవైపు, టీ కాంగ్రెస్ సీనియర్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై కొమురెల్లి విజయలక్ష్మిరెడ్డి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను గండ్ర శారీరకంగా వాడుకొని వదిలేశాడని ఆరోపిస్తూ ధర్నాకు దిగింది. అంతేకాకుండా, ఆయనపై నిర్భయ చట్టం కింద అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది.
 
మదర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధిగా పనిచేస్తున్న తాను.. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో గండ్రతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిచయం కాస్త చనువుగా మారడంతో తామిద్దరం శారీరకంగా పలుమార్లు కలిసినట్టు చెప్పింది. 
 
నాలుగురోజులవరకూ కూడా తనతో చనువుగా ఉన్నాడని చెప్పింది. అయితే, ఈ నెల 3వ తేదీ రాత్రి ఆయనను కలిసేందుకు జీఎంఆర్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్తే.. పోలీసులకు చెప్పి అరెస్టు చేయించాడని ఆరోపించింది. ఈ ఆరోపణలపై గండ్ర భార్య జ్యోతి స్పందించారు. తమ పెళ్లయి 33 ఏళ్లు అవుతోందని, తన భర్త ఎలాంటివారో తనకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై మరింత చదవండి :