సంబంధిత వార్తలు
- పుట్టినరోజు వివాదంపై విశాఖ శారదాపీఠం వివరణ...
- బిగ్ బాస్ షోలో మహాకవి శ్రీశ్రీ కవితను వినిపించిన కమల్ హాసన్
- ''నటన సూత్రధారి'' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
- అబ్ధుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య కేసు... బెయిల్పై సీఎం జగన్ స్పందన..
- కోర్టులో వీళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి చెల్లుబాటు కాలేదు: జగన్
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ చెల్లించారు. అక్టోబరులో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశారు. రైతులకు తన వంతు ఎంత చేసినా తక్కువేనని జగన్ తెలిపారు. గత 18 నెలల్లో 90 శాతానికి పైగా తమ హామీలను నెరవేర్చామని తెలిపారు.
పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తామన్న జగన్ ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో రైతులను ఆదుకుంటామని తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాము. పగటి పూట ఉచితంగా 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాము. ఇక రైతులకు బీమా కూడా తామే చెల్లిస్తున్నామని తెలిపారు.
147 అగ్రి ల్యాబులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంటల కొనుగోలు కోసం 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో మొదటి విడత పాల సేకరణలో భాగంగా బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
