1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Janasena Chief Pawan Kalyan statement on Gauri Shankar

ఒక్క గౌరీని హతమార్చితే 'మిలియన్ల గౌరీలు' పుట్టుకొస్తారు : పవన్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో కాల్చివేతకుగురైన సీనియర్ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్యపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస

Gauri Shankar
కర్ణాటక రాజధాని బెంగుళూరులో కాల్చివేతకుగురైన సీనియర్ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్యపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. 
 
చేతిలో పెన్నుతో సామాజిక న్యాయం, నిబద్ధత కోసం మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నవ్యక్తి భావస్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. భిన్నమతాలు, భాషలు, సంస్కృతులు.. ఉన్న మన దేశంలో ఓ మహిళా జర్నలిస్టు హత్యకు గురికావడం దారుణమన్నారు. ఈసంఘటన ద్వారా మన జాతి నిర్మాతల స్ఫూర్తిని హతమార్చినట్టే అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ఈ హత్యకు గల కారణాలు తెలుసుకోకుండా, దీని వెనుక హిందుత్వ శక్తులు ఉన్నాయని ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. ఒక గౌరీ లంకేశ్‌ను హత మార్చడం ద్వారా 'మిలియన్ల గౌరీలు' పుట్టుకొస్తారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కోరారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
డేరా బాబా ఆశ్రమంలో కుప్పలుతెప్పలుగా అస్థిపంజరాలు...