1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. krishna crime news

కట్టుకున్న భార్యను కడతేర్చాడు.. అక్రమ సంబంధానికి అడ్డుగా వుందని..?

krishna
అక్రమ సంబంధానికి అడ్డుగా వుందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను హతమార్చాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉప్పులూరు ఎస్సీ కాలనీకి చెందిన కోటేశ్వరరావుకి పెదపారుపూడి మండలం మోపర్రుకు చెందిన మహిళ(40)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే కోటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న భార్య అతడిని నిలదీసింది. దీనిపై కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
ప్రియురాలి దగ్గరకు వెళ్తున్న కోటేశ్వరరావును భార్య నిలదీసింది. దీనిపై గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన అతడు భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికులు మృతురాలి సోదరుడికి సమాచారం ఇవ్వగా అతడు వెంటనే అక్కడకి చేరుకున్నాడు. గురువారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వెయ్యి రూపాయల అప్పు.. తిరిగి ఇవ్వలేదని.. అత్యాచారం.. నిందితుడికి?