సంబంధిత వార్తలు
- యువకుడు వికృత చేష్టలు... దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య కన్నుమూత
- బాలయ్య కొత్త సినిమా ప్రారంభమైంది. కథ ఎవరిదో తెలుసా..?
- బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ మారిందా..? అసలు కారణం ఇదేనా..?
- నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. సినిమాలంటే ఆసక్తి లేదు... వాటిపైనే దృష్టి
- జగన్ ప్రజా నాయకుడు... రియల్ హీరో... 'బాహుబలి' పెదనాన్న పొగడ్తలు
ఎలుకల మందును రుచిచూసిన ఫాస్టర్.... గాల్లో కలిసిన ప్రాణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎలుకలు మందును రుచిచూసిన ఓ ఫాస్టర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లాకు చెందిన రాబర్ట్ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ చర్చిలో ఫాస్టర్‌గా పని చేస్తున్నాడు.
అయితే, చర్చిలో ఎలకల బెడద ఎక్కువగా ఉండటంతో ఆహార పదార్థంలో ఎలుకల ముందు కలిపి చర్చిలో అక్కడక్కడా పెట్టాడు. కానీ, ఆ ఎలుకల మందు పని చేస్తుందో లేదనన్న సందేహంతో రుచి చూశాడు.
అంతే... ఈ మందు ఘాటైన విషపదార్థం కావడంతో రాబర్ట్ ఆరోగ్యం కొద్దిసేపట్లోనే క్షీణించింది. దాంతో చర్చి సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.
