సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (11:37 IST)

నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. సినిమాలంటే ఆసక్తి లేదు... వాటిపైనే దృష్టి

ఈ వార్త నందమూరి ఫ్యాన్స్‌ను షాక్ గురిచేస్తోంది. యువరత్న బాలకృష్ణ ఏకైక పుత్రరత్నం మోక్షజ్ఞ. ఈ కుర్రోడిని వెండితెరపై హీరోగా చూడాలని నందమూరి ఫ్యాన్స్ కలలుగంటున్నారు. కానీ, మోక్షజ్ఞ మాత్రం తనకు హీరోగా రావడం ఏమాత్రం ఇష్టం లేదని తెగేసి చెపుతున్నాడు. దీంతో వారంతా షాక్‌కు గురయ్యారు.
 
నిజానికి కొంతకాలం క్రితం మోక్షజ్ఞ యాక్టింగ్ స్కూల్‌కు వెళుతూ నటన, డ్యాన్సులు నేర్చుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెండితెరపై మరో నందమూరి వారసుడుని చూడొచ్చని ప్రతి ఒక్కరూ సంబరపడిపోయారు. అయితే, తన తండ్రి బాలకృష్ణ బలవంతం మీదే మోక్షజ్ఞ యాక్టింగ్ స్కూల్‌కు వెళుతున్నట్టు తాజాగా తేలిపోయింది. 
 
తనకు హీరో కావడం కంటే వ్యాపారల్లో రాణించడమే ఇష్టమని చెప్పినట్టు సమాచారం. మోక్షజ్ఞ "కేరాఫ్ కాఫీ షాప్" అంటూ ఓ ఆంగ్లపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో మోక్షజ్ఞ అభిరుచులు, ఇష్టాయిష్టాలను స్పష్టంగా చెప్పింది. తనకు సినిమాలంటే ఏమాత్రం ఇష్టం లేదని తెగేసి చెప్పారు. దీనిపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.