శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (12:41 IST)

''కబీర్ సింగ్ '' రొమాంటిక్ వీడియోను ఓ లుక్కేయండి..

బాలీవుడ్‌లో నటుడు షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. ''మేరే సోనియా'' అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.


టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు కబీర్ సింగ్ రీమేక్. ఈ సినిమా హిందీలోనూ సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయమని తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ వీడియోను చూస్తేనే అర్థమైపోతుంది. 
 
తెలుగులో అర్జున్ రెడ్డికి దర్శకత్వం వహించిన సందీప్ వంగానే బాలీవుడ్ కబీర్ సింగ్‌కు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటించారు.

ఇప్పటికే విడుదల ట్రైలర్, పాటలకు అనూహ్య స్పందన లభించింది. తాజాగా విడుదలైన కబీర్ సింగ్ రొమాంటిక్ సాంగ్ కూడా విడుదలైన గంటల్లోనే భారీ వ్యూస్‌ను నమోదు చేసుకుంది. ఈ పాటను ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.