1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Lady police constable suicide in Nellore

ఫ్యాన్‌కి ఉరి వేసుకొని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Lady police
నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక నాగలక్ష్మీ అనే మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అశోక్ తనను నిత్యం వేధించేవాడని మనస్థాపానకి గురైనట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 
 
ఎస్పీ కార్యాలయంలో కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగలక్ష్మి పనిచేస్తుంది. భర్త అశోక్ వేధింపులు తాళలేక నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు కూడ తెలిపారు. నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
పవన్ కల్యాణ్: ‘పవర్‌’పై వరుస ట్వీట్లు.. ‘విద్యుత్ కోతలే ప్రజలకు దసరా కానుకలా?’