1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Leopard on hyderabad Road

లాక్ డౌన్.. రోడ్డుపై చిరుత.. హడలిపోయిన జనం.. చివరికి?

Leopard
లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవుల్లో నివసించే క్రూర మృగాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాదులో రోడ్లపై నెమళ్లు విహరిస్తూ కనిపించాయి. 
 
తాజాగా హైదరాబాద్‌లోని మైలార్దేవ్ పల్లిలోనపి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఓ చిరుత కనిపించడంతో అందరూ హడలిపాయారు. జనాలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ చిరుత గాయపడిందని.. అందుకే కదలలేని పరిస్థితిలో అలాగే కూర్చుండిపోయిందని చెప్తున్నారు. 
 
ఇక చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఈ చిరుత ఎక్కడ నుంచి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చి విచారించిన తర్వాత తెలియనుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఎవరు నాతో ఆడుకోవట్లేదు.. వారిని అరెస్ట్ చేయండి.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు