బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మే 2020 (09:58 IST)

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 3,722 కేసులు

కరోనా మహమ్మారి భారత్‌లో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా ఈ వైరస్ కారణంగా 134మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం​ కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరుకోగా.. మృతుల సంఖ్య 2,549కి చేరింది. దేశంలో ప్రస్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 25,385 మంది కోలుకున్నారు.
 
తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 25,922 పాజిటివ్ కేసులు, 975 మంది మృతి చెందగా, గుజరాత్‌లో 9,267 పాజిటివ్ కేసులు, 566 మంది ప్రాణాలు కోల్పోగా, తమిళనాడులో 9,227 పాజిటివ్ కేసులు, 64 మంది మరణించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 7,998 పాజిటివ్ కేసులు, 106 మంది మృతి చెందారు.