శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (11:11 IST)

చికెన్ ధరలకు రెక్కలు.. అందినకాడికి దోచుకుంటున్న వ్యాపారులు

చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనాతో చికెన్ తినడం మానేసిన ప్రజలు.. సెలెబ్రిటీలు చికెన్ తింటే ఏమీ కాదని చెప్పడంతో వాటిని కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకున్న వ్యాపారులు భారీగా రేట్లు పెంచేశారు. 
 
చికెన్‌పై ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు సెలబ్రిటీలు, వైద్యులు కూడా అవగాహన పెంచడంతో.. చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపించారు. గత నెల రోజుల క్రితం కిలో చికెన్‌ రూ.50-60లకి దొరికేది. కానీ ప్రస్తుతం కిలో రూ.180 నుంచి 200లకి అమ్ముతున్నారు.
 
కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో 15 రోజుల క్రితం చికెన్ ధర రూ.120లు ఉండగా, ప్రస్తుతం రూ.80 అందనంగా పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో రూ.220లకి కూడా అమ్ముతున్నారు. నగరంలో ఒకేసారి పెంచిన చికెన్ ధరలతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.