గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మే 2020 (15:17 IST)

టీవీ5 ఛానల్‌పై దాడి.. ఖండించిన పవన్, చంద్రబాబు

హైదరాబాదు టీవీ5 ఛానల్ ప్రధాన కార్యాలయంపై గత అర్థరాత్రి కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై దాడి అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమేనని ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని అధికారులను కోరారు. 
 
ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తాను ఎంతో బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి దుష్ట చర్యలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పవన్ ట్వీట్ చేశారు. టీవీ5 చానల్ యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు.