బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (17:48 IST)

తలసాని నోరు అదుపులో పెట్టుకో.. కేసీఆర్‌ను ఎప్పుడూ తిట్టలేదు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తలసాని తిన్నింటి వాసాలు లెక్కపెడతారని విమర్శించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు దయతో నాయకుడు అయ్యాడని.. ప్రస్తుతం ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
తాను టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యానని.. కానీ కేసీఆర్‌ను ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన విధానాలనే వ్యతిరేకించానన్నారు. కావాలంటే గత వీడియోలు పరిశీలించవచ్చునని తెలిపారు. 
 
ఎవరి ఊరికి వాడే పటేల్.. మళ్లీ మళ్లీ మాట్లాడితే చాలా చరిత్రే ఉంది. అది బయటపెడతామంటూ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ వన్‌మెన్‌ షో చేస్తున్నారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ డమ్మీ అంటూ చెప్పుకొచ్చారు. తలసాని లాంటి మంత్రులు బయట పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.