గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మే 2020 (20:39 IST)

'పవన్‌'పై ఇష్టం లేదు.. 'జల్సా' కోసం ఆశపడలేదు : పూనంకౌర్ (video)

తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉన్న హీరోయిన్లలో పూనంకౌర్ ఒకరు. ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడలేని అభిమానం. అందుకే, ఎవరైనా పవన్‌ను పల్లెత్తు మాట అంటే అస్సలు సహించదు. అలాంటి పూనమ్ కౌర్‌కు పవన్ కళ్యాణ్‌కు లింకు పెడుతూ అనేక వార్తా కథనాలు వచ్చాయి. గుసగుసలు కూడా బోలెడు వినిపించాయి. కానీ, వాటిపై వారిద్దరూ ఎక్కడా స్పందించలేదు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు దివంగత డాక్టర్ దాసరి నారాయణ రావు జయంతిని పురస్కరించుకుని ఆమె ఓ ట్వీట్ చేసింది. ఇందులో పవన్‌తో పాటు, జల్సా సినిమా గురించి కామెంట్ చేసింది. 
 
గతంలో జల్సా సినిమా పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో పూనమ్ కౌర్ హీరోయిన్‌గా చేసేందుకు తెగ ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె స్పందించారు.
 
గత ఎన్నికల సమయంలో తన గురించి అనేక పుకార్లు వినిపించాయి. 'జల్సా' సినిమాలో అవకాశం దక్కలేదని తాను ఎంతో వేదనకు గురైనట్టు ప్రచారం చేశారని... అవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది. 
 
ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప... మరే ఇతర డైరెక్టరుతో పని చేయాలని తాను కలలు కనలేదని పూనమ్ కౌర్ తేల్చి చెప్పింది. అంటే పవన్‌ కళ్యాణ్ అంటే కూడా తనకు ఇష్టంలేదని చెప్పకనే చెప్పింది.