శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (10:56 IST)

నలుగురు భార్యలున్న 70 యేళ్ళ వృద్ధుడు యువతిపై అత్యాచారం!

ఆయన వయస్సు 70 యేళ్లు. కాటికి కాళ్లుచాపివున్నాడు. పైగా, నలుగురు భార్యలు. అయినా ఆయనలో కామదాహం చల్లారలేదు. దీంతో తమ ఇంటి పక్కనే వున్న ఓ యువతిపై మనస్సుపడ్డాడు. ఆమెన చెరబట్టాడు. అయినప్పటికీ ఆ యువతి లొంగలేదు. దీంతో డబ్బులు ఆశచూపి తాను అనుకున్న పనిని పూర్తిచేశాడు. అంటే... లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో 70 ఏళ్ల మొహమ్మద్ సలీమ్ ఉద్దీన్‌ నివాసముంటున్నాడు. సలీమ్‌కు నలుగురు భార్యలు.. వారంతా విదేశాల్లో ఉంటారు. సలీమ్ కూడా విదేశాల్లోనే ఉండి అమ్మాయిల కోసం తరచూ హైదరాబాద్‌కు వస్తూ ఉంటాడు. నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిపించుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడటమే అతని దినచర్య. 
 
తాజాగా 23 ఏళ్ల యువతిపై కన్నేసిన సలీం ఆర్థిక సహాయం పేరుతో ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి మత్తు మందిచ్చి పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాలిక పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఆ యువతి కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో యువతి ఇచ్చిన ఫిర్యాదుపై సలీమ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పైగా, ఈ విధంగా ఎంతమందిపై అత్యాచారం చేశాడన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.