శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 9 మే 2020 (17:47 IST)

వనస్థలిపురంలో భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భార్య

ఓ వైపు కరోనా వలన లాక్ డౌన్ విధించి ఎవరు బయటకు రావద్దు జాగ్రత్తగా ఉండాలని చెప్పినా.. కొంతమంది మాత్రం వారి బుద్ధి మార్చుకోలేకపోతున్నారు. ఓ ప్రబుద్దుడు ఈ లాక్ డౌన్ టైమ్‌లో ప్రియురాలితో రాసలీలు కొనసాగిస్తూ పోలీసులకు చిక్కి బుక్కయ్యాడు. ఇంతకీ పోలీసులకు సమాచారం ఎలా తెలిసిందంటే... అతని భార్యే భర్తను పోలీసులకు పట్టించింది.
 
మేటర్ ఏంటంటే... హైదరాబాద్ లోని వనస్థలిపురంలో భర్త అనిల్ అక్రమ సంబంధాన్ని చాలా తెలివిగా బయటపడేట్లు చేసింది భార్య. లాక్‌డౌన్ కదా.. ఎవరికీ దొరకను అనుకున్నాడో ఏమో కానీ లాడ్జిలో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు భర్త. తనని ఎవరు కనిపెట్టలేరనుకుని ప్రియురాలితో రాసలీలలో మునిగిపోయాడు. 
 
అయితే... ఈ విషయాన్ని కనిపెట్టిన భార్య పోలీసులకు సమాచారాన్ని అందించింది. లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందని.. దీనిలో లాడ్జీ ఓనర్ ప్రమేయం కూడా ఉందని చెప్పింది. అంతే.. పోలీసులు రంగంలోకి దిగారు. లాడ్జీ పైన దాడి చేసారు. ముగ్గురు అమ్మాయిలతో పాటు అనిల్‌ను, లాడ్జి ఓనరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలితో కలిసి పట్టుబడ్డ అనిల్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో పలుకుబడి కలిగిన పోస్టులో వుండటం గమనార్హం.