మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 7 మే 2020 (22:54 IST)

డాక్టర్లతో నర్సు అక్రమ సంబంధం, భర్తకు తెలియడంతో..?

హర్యానాలోని గురుగ్రాం ప్రాంతమది. ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ప్రియకు ఆరు నెలల క్రితం వివాహమైంది. భర్త చున్నీలాల్ స్థానికంగా ప్రొవిజన్స్ పెట్టుకుని జీవనం సాగించేవాడు. మొదట్లో వీరి కాపురం బాగానే ఉంది. కానీ ప్రియ మాత్రం ఆసుపత్రిలో చాలామంది డాక్టర్లతో అఫైర్లు కొనసాగించింది.
 
విషయం కాస్త భర్తకు తెలిసింది. ఇద్దరి మధ్యా గత రెండు నెలల నుంచి తరచూ గొడవే. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. గొడవలు మాత్రం తరచూ జరుగుతూనే ఉండేవి. దీంతో ప్రియ భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. 
 
అన్నంలో మత్తు మందు కలిపి పెట్టింది. చున్నీలాల్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ చనిపోలేదు. బంధువులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. బతికి బయటపడ్డ అతనిపై మళ్ళీ చంపేందుకు స్కెచ్‌లు వేసింది. ఈ విషయం కాస్త బాగా అర్థమైంది భర్తకు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి భార్యపై ఫిర్యాదు చేశాడు. మొదట్లో అన్నంలో విషయం కలిపి పెట్టిన విషయాన్ని స్థానిక వైద్యుల సహకారంతో బయటకు రాకుండా జాగ్రత్త పడింది ప్రియ. కానీ ప్రియ గురించి భర్తకు అన్నీ తెలియడంతో అడ్డంగా దొరికిపోయింది.