మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మే 2020 (22:09 IST)

మగ కరోనా పేషెంట్‌పై డాక్టర్ అత్యాచారయత్నం..

కరోనా మహమ్మారి కోట్లాది మంది జీవితాలను పొట్టనబెట్టుకుంటే.. ఇన్నాళ్లు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడిన కామాంధులు ప్రస్తుతం లింగబేధం కూడా చూడట్లేదు. కరోనా కారణంగా ఆస్పత్రులకే వైద్యులు పరిమితం అవుతున్నారు. కానీ  కొంతమంది వైద్య ముసుగులో ఉన్నవారు వైద్య రంగంపైనే మాయని మచ్చలా మారుతున్నారు. 
 
తాజాగా ఉన్నతమైన వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ చేయకూడని పని చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబైలోని ఓ ఆస్పత్రిలో 34 ఏళ్ల డాక్టర్ ఆదివారం చేరాడు. సోమవారం ఉదయం ఐసియూ వార్డులో చికిత్స పొందుతున్న ఓ 44 ఏళ్ల మగ కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుడిపై ఈ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. 
 
రోగి అభ్యంతరం తెలుపుతున్నపటికీ... అతడిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం కాస్త ఆసుపత్రి ఉన్నత అధికారులకు తెలియడంతో... అతడిని వెంటనే విధుల నుంచి తొలగించారు. వారి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ప్రస్తుతానికి ఆ డాక్టర్ తన ఇంటిలోనే స్వీయ నిర్బంధం అనుభవిస్తున్నాడు.