శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (16:11 IST)

హీరో నిఖిల్ పెళ్లికి వేదిక ఫిక్స్ - రేపే వివాహం

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈయన వివాహం గురువారం హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
నిజానికి నిఖిల్‌, డాక్ట‌ర్ ప‌ల్ల‌వివ‌ర్మ‌ను గత నెల 16వ తేదీన జరగాల్సివుంది. కానీ, క‌రోనా ప్ర‌భావంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. త‌ర్వాత మే 14వ తేదీని పెళ్లిని నిర్ణ‌యించారు. కానీ మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగించ‌డంతో పెళ్లి వాయిదా వేసుకునే ఆలోచ‌న‌లోఉన్న‌ట్లు నిఖిల్ తెలిపారు. 
 
అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 6 గంటల 31 నిమిషాలకు హీరో నిఖిల్ పెళ్లి హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని ఫామ్‌హౌస్‌లో ఈ పెళ్లి జ‌ర‌గ‌నుందట‌. ఈ పెళ్లికి ప‌ర‌మిత సంఖ్య‌లో బంధువులు, శ్రేయోభిలాషులు హ‌జర‌వుతార‌ని స‌మాచారం. 
 
గత ఆదివారం టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఇంటివాడైన విషయం తెల్సిందే. ఆయన కూడా అతికొద్ది అతిథుల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నారు. ఈయన మొదటి భార్య అనిత అనారోగ్యం కారణంగా చనిపోయిన విషయం తెల్సిందే.