1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Lokesh fire on YCP government

పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారు

Lokesh
జగన్ పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. ఇది జగన్ రివర్స్ టెండరింగ్​కు పరాకాష్ట అని ఆయన ఎద్దేవా చేశారు.

గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను జగన్ లాక్కొని ఇళ్లస్థలాల పేరిట తిరిగి వాళ్లకే పంచుతున్నారని లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇది జగన్ రివర్స్ టెండరింగ్​కు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.

పథకాల మార్పుకోసం పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు.

జగన్ అక్రమంగా సంపాదించిన వేల ఎకరాల ఎస్టేట్​లు, ప్యాలెస్​లు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. తద్వారా లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు వస్తాయన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
సిట్​కు పోలీసుస్టేషన్ హోదా.. ఉత్తర్వులు జారీ