1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Lover on the track, train driver applied sudden break in krishna canal

ట్రాక్ పైన ప్రేమికుడు, రైలు డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తి

Lover
ఎపుడూ య‌ధాలాపంగా రైలు న‌డిపే ఇంజ‌న్ డ్రైవ‌ర్, ఎందుకో ట్రాక్ వైపు నిశితంగా దృష్టి పెట్టాడు. అక‌స్మాత్తుగా ఓ యువ‌కుడు రైల్వే ట్రాక్ పైకి వ‌చ్చేసి, ప‌ట్టాల‌పై అడ్డంగా ప‌డుకున్నాడు. అంత స్పీడులోనూ డ్రైవ‌ర్ స‌డ‌న్ బ్రేక్ వేశాడు. అంతే, ఆ యువ‌కుడికి ప్రాణాపాయం త‌ప్పి, గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. 
 
ఏపీ సీఎం నివాసం ఉండే, తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డి రైల్వే ట్రాక్ పైన ఓ యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ట్రైన్ డ్రైవర్ బ్రేక్ వేయటంతో ప్రాణాపాయం తప్పింది.

ఆ యువ‌కుడిని అదే ట్రైన్‌లో విజయవాడకు తరలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపారు. యువ‌కుడి రెండు కాళ్ళ‌కు గాయాల‌య్యాయి. ఆ యువ‌కుడు నులకపేటకు చెందిన పృథ్వీగా గుర్తించారు.

ప్రేమ విఫ‌ల‌మై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేందుకు ట్రాక్ పైకి వ‌చ్చాడ‌ని తెలుస్తోంది. పృధ్వి ప్ర‌స్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
About Writer
జెఎస్కె
తర్వాతి కథనం
బ్రిటిష్ వార‌సుడిగా జ‌గ‌న్, అందుకే తెలుగు ఖూనీ