గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి

సెల్ఫీ వీడియో తీసి నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసి నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే... బొబ్బిలికి చెందిన యువకుడు రాకేష్‌, కురుపాంకు చెందిన యువతి గాయత్రి ప్రేమించుకున్నారు.
 
ప్రేమించి, పెళ్లి చేసుకున్న తమను వేధించవద్దంటూ.. వాట్సప్‌ వీడియోలను విడుదల చేసి ప్రేమికులు అదృశ్యమయ్యారు. రెండు రోజుల నుంచి గాయత్రి, రాకేష్‌ కనిపించకుండాపోయారు. బుధవారం స్పిల్‌వేకు దగ్గరలో నాగావళి డ్యామ్‌కి 200 మీటర్ల దూరంలో గాయత్రి, రాకేష్‌ల మృతదేహాలు కనిపించాయి.
 
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మొబైల్‌లో ప్రేమికులు తీసిన సెల్ఫీ వీడియోను గుర్తించారు. వీడియోలో... ''కలిసి జీవించలేం, కనీసం కలిసి మరణిద్దాం అని, ప్రేమజంట చున్నీతో ఒకరినొకరు కట్టుకున్నారు. 
 
తాము ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నప్పటికీ తమ ముఖంలో భయం లేదు అని చెప్పి తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు'' ఘటనా స్థలానికి ప్రేమికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మృతదేహాలను చూసి రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.