మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (11:51 IST)

భార్య పనికి వెళ్లగానే కుమార్తెపై అత్యాచారం... కన్నతండ్రి అఘాయిత్యం

హైదరాబాద్ నగరంలో కన్న కుమార్తెపై కన్నతండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యం గత మూడు నెలలుగా కొనసాగుతూ వచ్చింది. ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించడంతో 17 యేళ్ల బాలిక బయటకు చెప్పలేదు. అయితే, కుమార్తె ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి నిలదీయడంతో అసలు విషయం తెలిసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ రెయిన్ బజార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివసిస్తున్న ఓ వ్యక్తి(38) పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. అతడి కళ్లు వయసుకు వచ్చిన కుమార్తెపై పడ్డాయి. భార్య పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తె(17)పై అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి మూడు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి ఆమెను ప్రశ్నించగా విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.