శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (09:40 IST)

జాకెట్ కుట్టించుకునేందుకు వెళ్లితే లైన్లో పెట్టి.. అత్యాచారం చేశాడు...

జాకెట్ కుట్టించుకునేందుకు టైలరింగ్ షాపుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఎవరూలేని సమయంలో షాపుకు వెళ్లగా పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురా చంద్రానగర్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ (22) అనే వ్యక్తి టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఈయన షాపుకు 20 యేళ్ల వయసున్న యువతి జాకెట్లు కుట్టించుకునేందుకు వెళ్లింది. ఈ క్రంమలో యూసుఫ్‌ మాటామాట కలిపాడు. అలా వారిద్దరి మధ్య మాటలు కలవడంతో మంచి స్నేహం ఏర్పడింది. 
 
ఆ తర్వాత ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో ఆమెను నమ్మించి అత్యాచారం చేశాడు. తన కోర్కెలు తీర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని ఆమె నిలదీయగా నిరాకరించాడు. యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.