మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (20:05 IST)

సిగ్గుతో దాచి పెట్టుకున్నా వదిలిపెట్టకుండా అలా సెల్ఫీ తీశాడు... ఏం చేయాలి?

నా బోయ్ ఫ్రెండ్ అంటే నాకు ప్రాణం. అతడు కూడా అంతే. ఈమధ్య మేమిద్దరం చాలా ఇంటిమేట్‌గా ఉన్నాం. ఆ సిచ్యువేషన్లో అతడు సెల్ఫీ తీశాడు. నేను సిగ్గుతో దాచిపెట్టుకున్నా వదిలిపెట్టలేదు. తన కోసం కావాల్సిందేనంటూ పట్టుబట్టాడు. అలా తీసుకుని బాగా ఆనందించాడు. నాక్కూడా చూపిస్తూ మనిద్దరం చూడు... అంటూ ఏదేదో వర్ణించాడు. కానీ అతడు చేసిన పని నాకు నచ్చలేదు. దాన్ని డిలీట్ చేయమంటే ఫీలవుతాడమోనని ఫీలవుతున్నా... అడిగితే నాకు దూరమైపోతాడా....?
 
పెళ్లి కాకుండా ఇంటిమేట్‌గా క్లోజ్ అవడమే తప్పు. అలా అవడమే కాకుండా వాటిని సెల్ఫీలంటూ తీసుకుని వాటిని ఫోనుల్లో పెట్టుకోవడం చాలా పెద్ద సమస్యే. ఈమధ్య కాలంలో సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోయింది. ప్రతి దాన్ని సెల్ఫీల్లో బంధిస్తూ రచ్చ చేసుకుంటున్నారు. రహస్యాన్ని బట్టబయలు చేసుకుని సమస్యల్లో చిక్కుకుంటున్నారు.
 
ఈ విషయంలో రెండో ఆలోచన చేయకుండా వాటిని వెంటనే డిలీట్ చేయమని చెప్పేయండి. దూరమైపోతాడని ఇలాంటి ప్రమాదకర ఫోటోలను ఫోన్లో పెట్టుకుని తిరిగితే ఎదురయ్యేది మరీ ప్రమాదకరంగా ఉంటుంది. అసలు పెళ్లి కాకుండా ఇలాంటి కృత్యాలు చాలా సమస్యలను తెచ్చిపెడతాయి. కనుక సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోండి.