నానా ప్రయత్నాలు చేసి అది వల్లకాక అటు తిరిగి పడుకుంటాడు... ఎందుకలా?
మాది ప్రేమ వివాహం. ప్రేమించే సమయంలో ఛాన్సు దొరికితే నాపై వాలి నానా హంగామా చేసేవాడు. శృంగారం కోసం ఎగబడేవాడు. తీరా పెళ్లయ్యాక ఆయనలో ఏదో తేడా ఉందనిపిస్తుంది. ఫోర్ ప్లేతో నన్ను రెచ్చగొట్టి, ఆ తర్వాత శృంగారం చేసేందుకు నానా ప్రయత్నాలు చేసి అది వల్లకాక అటు తిరిగి పడుకుంటాడు. ఓరోజు సిగ్గు విడిచి అతడిని ఓ విషయం అడిగేశా.
ఆ సామర్థ్యంలో ఏమైనా తేడా వున్నదేమో చెక్ చేయించుకోమని చెప్పా. నేను ఆ మాట అన్నందుకు ఇంతెత్తున లేచి... అది వృద్ధుల్లో ఉంటుంది కానీ నాలాంటి యవ్వనవంతుల్లో ఎలా ఉంటుంది. నాకెలాంటి సమస్య లేదు అన్నాడు. మరైతే ఎందుకు చేయలేకపోతున్నావని అడిగితే... రెండుమూడు రోజుల్లో చక్కబడుతుందని అంటున్నాడు. చక్కబడుతుందా... లేదంటే ఆయనలో సమస్య వుందా?
మీవారు అనుకుంటున్నట్లుగా ఆ సమస్య అనేది వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 40 ఏళ్ల లోపు వారిలో 26 శాతం మంది అలాంటి సమస్య ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి ఆయనలో స్తంభన సమస్య ఉన్నదని అనుమాన పడటం ఏమీ తప్పుకాదు. వైద్యులకి చూపించి తగు వైద్య చికిత్సను తీసుకోండి. సమస్య నుంచి బయటపడతారు.