శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (14:37 IST)

నా ప్రేయసి పక్కన కూర్చున్నా ఆ ఫీలింగ్ రావడంలేదు... నేను పనికొస్తానా?

నేను, నా గర్ల్ ఫ్రెండ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నా వయసు 20 ఏళ్లప్పుడు ఆమెతో నాకు పరిచయమైంది. అప్పట్లో ఆమెను చూస్తే చాలు... శృంగారం చేయాలనిపించేది. అప్పట్లో ఆమెను ఎంతగా బ్రతిమాలినా ఒప్పుకోలేదు. ఓసారి మరీ కాళ్లావేళ్లా పడితే కోపగించుకుని, నాకు సర్ది చెప్పింది. ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని చవిచూద్దామని చెప్పింది. అనుకున్నట్లే నాకు ఉద్యోగం వచ్చింది.
 
ఇప్పుడు నా వయసు 30. కానీ ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. అదేమిటంటే... నా ప్రేయసి నా దగ్గరకు వచ్చి ప్రక్కనే కూర్చుంటున్నా శృంగార పరమైన ఆలోచనలు రావడంలేదు. అసలది స్తంభించకుండా పోతోంది. ఎందుకిలా అయిపోయానో అర్థం కావడంలేదు. నేను గమనించింది ఏమిటంటే... నాకు కొన్ని నెలలుగా శృంగారపరమైన ఆలోచనలే రావడం మానేశాయి. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అని నా ప్రేయసి అంటోంది. అసలు నేను శృంగారానికి పనికి వస్తానా? పెళ్లి చేసుకోవచ్చా?
 
పురుషుల్లో 18 నుంచి 28 ఏళ్ల వరకు పదేళ్లపాటుగా శృంగారపరమైన కోరికలు, స్తంభనలు బాగా ఉంటాయి. ఈ వయసు దాటాక కొంతమందిలో ఉద్యోగ భద్రత, ఆర్థికపరమైన ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు... తదితర సమస్యల వల్ల స్తంభనపై ప్రభావం పడుతుంది. అంతేకాదు వీర్యం పరిమాణం కూడా తగ్గిపోవడం ఉంటుంది. అంతమాత్రాన వాళ్లకు శృంగార సామర్థ్యం ఉండదని చెప్పలేం. శృంగారం పట్ల మీ ఆలోచనలు యాంత్రికంగా మారిపోవడం వల్లే ఇలా అయి వుంటుంది. ఒకసారి హార్మోన్ పరీక్షలు చేయించుకుని చెక్ చేసుకోండి. అన్నీ సక్రమంగా ఉన్నాయనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. శృంగార సామర్థ్యం పురుషుల్లో 70 ఏళ్ల వరకూ ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అంతకంటే ఎక్కువగా కూడా వుంటుంది.