శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (20:26 IST)

ఆయన శృంగారంలో చాలా వీక్‌గా వుంటున్నారు... ఏమై వుంటుంది...

కొందరిలో శృంగార వాంఛలు కలగకపోవడం ఒకటైతే... మరికొందరిలో వున్నప్పటికీ సమర్థత లేకుండా పోతుంది. వాస్తవానికి ఆరోగ్యవంతమైన పురుషులు రోజుకు ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొంటారు. అలా చేయలేని పరిస్థితికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఉద్యోగంలో వత్తిడి, అనారోగ్య సమస్యలు తదితరాలు కావచ్చు. 
 
ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారిలో పురుషుని వ్యక్తిగత భాగం స్తంభించకుండా ఉంటుంది. కనుక ఓసారి షుగర్ పరీక్షలు చేయించుకుని పరిస్థితి చెక్ చేయించుకోవడం మంచిది. షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేస్తే అది నరాల బలహీనతకు దారి తీయవచ్చు. అప్పుడు శృంగార జీవిత మాధుర్యాన్ని చవిచూడలేని స్థితి వస్తుంది.