శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: మంగళవారం, 23 అక్టోబరు 2018 (17:40 IST)

ఆమె శబరిమల కొండపైకి ఎక్కింది... ప్యాంటీలెస్ ఫోటో చూసి పోలీసులు షాక్...

శబరిమల ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతోందా? మహిళలు కూడా శబరిమల అయ్యప్పను దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు, దేవుడి వద్ద అంతా సమానమే అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కొందరు మహిళలు శబరిమలను దర్శించుకునేందుకు వెళుతున్నారు. వీరికి పోలీసులు రక్షణ కవచంగా వుంటున్నారు. ఐతే కొండపైకి వెళ్లాక అయ్యప్ప దర్శనం అంత తేలిగ్గా జరగడం లేదు వారికి. అక్కడ ఆందోళన మిన్నంటుతోంది.
 
ఇదిలావుంటే ఇటీవలే అన్యమతస్తురాలైన రెహనా ఆలయంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించి వివాదానికి తెర లేపింది. సోషల్ యాక్టివిస్ట్ అయిన రెహనా ఈ ఏడాది మార్చిలో రెహానా తన నగ్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు... స్త్రీలు తమ ఛాతీని చూపించకూడదు అని ఓ ప్రొఫెసర్ చేసిన కామెంట్లపై స్పందిస్తూ... దుస్తుల్లేకుండా వున్న ఫోటోను పోస్ట్ చేసింది. పుచ్చకాయలు అడ్డుపెట్టుకుని ఫోటో దిగి దాన్ని షేర్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె చేసినవి చాలానే వున్నాయి. 
 
ప్యాంటీలెస్ డే అంటూ పైన షర్ట్ మాత్రమే వేసుకుని దిగిన ఫోటోలు... ఇలా చాలానే ఆమె ఫేస్ బుక్కులో దర్శనమిస్తాయి. ఐతే శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లిన ఆమె మరో అడుగు ముందుకేసి అయ్యప్ప దీక్షలో భక్తులు ధరించే నలుపు వస్త్రాలు ధరించి, మెడలో మాల వేసుకుంది. అంతవరకూ బాగానే వుంది కానీ కింద భాగాన్ని పూర్తిగా పైకి లేపేసి పట్టుకుని ఆమె ఫోజివ్వడంతో అయ్యప్ప భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అయ్యప్ప దర్శనం కోసం ఆమె కొండ ఎక్కిన సమయంలో పోలీసులు రెహానాను గుర్తించలేకపోయారు. 
 
కానీ ఆలయం వద్ద 18 మెట్ల వద్దకు వెళ్లేసరికి ఆమె ప్యాంటీలెస్ ఫోటో ఒకటి ఓ పోలీసుకి చేరిందట. అంతే... వెంటనే ఆమెను కిందికి పంపించివేశారట. మరోవైపు అయ్యప్ప భక్తులు కొందరు ఆమెపై కేసు వేశారు. మొత్తమ్మీద శబరిమల అయ్యప్ప దర్శనం మహిళలు కూడా చేసుకోవచ్చన్నందుకు పరిస్థితి ఇలా సాగుతూ వుంది. మరి ఎప్పటికి మామూలుగా మారుతుందో... స్వామియే శరణం అయ్యప్ప!!