గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (09:31 IST)

రాత్రి నాతో.. పగలు వాడితో.. అందుకే గొంతుపిసికి చంపేశా.. చేతులు కట్టేసి కిరోసిన్ పోశా...

రాత్రి నాతో గడుపుతూ పగలువాడితో తిరుగుతుందన్న అనుమానంతోనే తన ప్రియురాలిని గొంతుపిసికి చంపేసి, మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు పంజాబ్ డాన్సర్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు వెల్లడించారు. 
 
పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన సానియా బేగం (26)తో సంతోష్‌నగర్‌ ఒవైసీ కాలనీ నివాసి షేక్‌ సల్మాన్‌ (27) సహజీవనం చేస్తూ అనుమానంతో ఆమెను హత్య చేసిన విషయం విదితమే. పరారీలో ఉన్న అతడిని ఐఎస్‌ సదన్‌ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా సంతోష్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
కాగా, ఈ కేసును పరిశీలిస్తే, పంజాబ్‌కు చెందిన సానియా వృత్తిరీత్యా డాన్సర్. ఈమెకు వివాహమై భర్త, కమారుడు ఉన్నాడు. అయితే, మనస్పర్థలు తలెత్తడంతో భర్త, కొడుకును వదిలేసి హైదరాబాద్‌కు వచ్చింది. స్థానికంగా ఉండే ఓ బార్‌లో డాన్సర్‌గా పనిచేస్తోంది.
 
ఈ క్రమంలో ఈ బార్‌లోని పబ్‌కు వచ్చే సల్మాన్ అనే ఓ యువకుడితో ఆమెకు పరిచయమై.. అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. కానీ, అతడేమో కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఇతరులతో ఆమె చనువుగా మాట్లాడుతోందని లోలోపల రగిలిపోయాడు.
 
ఆ పగ ఆమెను పొట్టనబెట్టుకునేదాకా వెళ్లింది. ఇంట్లోనే ఆమెను చేతులు కట్టేసి.. గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో బుధవారం ఈ దారుణ ఘటన జరిగింది. సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.