సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (12:02 IST)

రంగు పిచ్చేంటి బాబోయ్.. హీరోలు ఎలా వున్నా పర్లేదా?

టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా.. ఓ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. హీరోలు ఎలా వున్నా పర్లేదు కానీ.. హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా వుండాలా అంటూ ప్రశ్నించింది. ఈషా రెబ్బా తాజా సినిమా సుబ్రహ్మణ్యపురం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె మాట్లాడింది. ఈషా కాస్త ఎక్కువ కలరుంటే బాగుంటుందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. 
 
అందుకు ఈషా రెబ్బా ఫైర్ అయ్యింది. అయినా ఈ కలర్ పిచ్చి ఎందుకండీ.. వున్న కలరే తనకు చాలని చెప్పింది. దీంతోనే సంతోషంగా వున్నానని వెల్లడించింది. హీరోలు ఎలా వున్నా ఫరవాలేదు గానీ, హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా వుండాలా అంటూ కౌంటరిచ్చింది. 
 
కాగా అరవింద సమేత సినిమాలో హీరోయిన్‌గా మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం వుంది. సుబ్రహ్మణ్యపురంతో ఈమెకు మంచి గుర్తింపు లభిస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.