గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:10 IST)

ఆ పని చేశాను... నన్ను చూడనిదే ఒక్కరోజు కూడా ఉండలేనంటోంది...

మా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు. నాకు ఫేస్ బుక్ చాటింగ్ ఇష్టం. ఈ చాటింగ్‌లో ఓ మహిళ నాకు పరిచయమైంది. ఆమె చాలా అందంగా కూడా ఉంది. దాంతో నేను చాటింగ్ కొనసాగించడం, ఆమె రిప్లై ఇవ్వడం జరిగిపోయేది. ఓ రోజు ఆమె ఫోన్ నెంబర్ అడిగాను. ఆమె ఓ రోజు గ్యాప్ ఇచ్చి నాకు ఇచ్చింది. ఫోన్ నెంబర్ ఇవ్వగానే నాలో కలిగిన ఆనందానికి అవధుల్లేవు. ఎంతగానో సంబరపడిపోతూ ఆమెకు ఫోన్ చేశాను. స్వీట్ వాయిస్. మత్తుగా ఉన్న ఆమె స్వరాన్ని విన్న తర్వాత ఒక్కసారి చూడాలని చెప్పాను. నాలుగు రోజుల తర్వాత సరేనని చెప్పింది. ఆమెను కలిసిన రోజు నేను పడిన సంతోషం అప్పటివరకూ జీవితంలోనే చూళ్లేదు. అలా ఇద్దరం బాగా సన్నిహితమయ్యాము.
 
నా ఒత్తిడి కారణంగా ఆమె నాతో శృంగారంలో కూడా పాల్గొంది. ఐతే మొన్నీమధ్యనే తనకు పెళ్లయిందనీ, రెండేళ్ల పాప ఉన్నదనీ, తన భర్తతో గొడవలు కారణంగా విడిపోయాననే నిజం చెప్పిందామె. నేను షాక్ తిన్నాను. అప్పట్నుంచి నాకు నేనుగా ఆమెకు క్రమంగా దూరంగా జరిగాను. కానీ ఆమె మాత్రం నన్ను వదలడంలేదు. ఆమె స్వయంగా ఫోన్ చేస్తోంది. నేను ఎక్కడున్నానో కనుక్కుని నాతో మాట్లాడి వెళుతుంది. నన్ను చూడనిదే ఒక్కరోజు కూడా ఉండలేనంటోంది. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈమెమో నన్ను వదిలి ఉండటంలేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థంకావడంలేదు. దారేంటి..?
 
ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సైట్ల ద్వారా ఇలా పరిచయాలు పెంచుకుని చాలామంది ఇలాంటి ఇబ్బందుల్లో పడుతున్నారు. మీరు చెప్పినదాన్నిబట్టి చూస్తుంటే మీరే ఆమెకు చాలా దగ్గరగా వెళ్లిపోయారు. పెళ్లయిందని చెప్పగానే దూరంగా జరిగిపోతున్నారు. సన్నిహితంగా, శృంగారం వరకూ వెళ్లే ముందు మీ భవిష్యత్తుపై ఎంతో నమ్మకం పెట్టుకున్నవారి గురించి ఎందుకు విస్మరించారు. ఐతే మీ ముందు రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి... మిమ్మల్నే నమ్ముకుని మీకు దగ్గరైన ఆమెను వివాహం చేసుకోవడం. రెండవది... ఆమెను వదులుకోవడం. కానీ రెండవది నమ్మించి మోసం చేసినట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ పెద్దలతో చర్చించక తప్పదు. చర్చించి ఓ నిర్ణయం తీసుకోండి.