1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Minor girl raped in Kavali

కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం వీడియో తీసి..?

rape
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన కావలి పట్టణంలోని తూఫాన్‌నగర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని తూఫాన్ నగర్‌కు చెందిన ఎస్‌కే మహబూబ్ బాషాగా గుర్తించారు. 
 
ఈ ఘటన కొద్దిరోజుల క్రితమే జరిగినప్పటికీ బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నిందితులు ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు పోక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు సర్వీసు