బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (10:54 IST)

బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్సురైలు

derailed
నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ గూడ్సు రైలు నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ కారణంగ ఆ మార్గంలో విజయవాడ వైపు వెళ్లాల్సిన పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. 
 
బిట్రగుంట రైల్వే స్టేషన్ దక్షిణం వైపు ఉన్న 144వ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద గూడ్సు రైలు ఫార్మేషన్ ఆగడంతో రోడ్ ట్రాఫిక్ ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, అత్యవసర రైళ్లను మూడో లైనుకు మళ్లి, రైళ్లరాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. 
 
వైకాపా నేత కొడాలి నాని మాజీ పీఏపై దాడి.. తలకు తీవ్ర గాయం 
 
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన అచంట లక్ష్మోజీపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తలకు బలమైన గాయం తగిలింది. సోమవారం రాత్రి ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన మచిలీపట్న కలెక్టరేట్‌‍లో పౌరసరఫరాల విభాగంలో పని చేస్తున్నారు. సోమవారం విధులు ముగించుకుని రైలులో గుడివాడకు వచ్చాడు. స్టేషన్ పక్కనే ఉన్న తన బైకును తీస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. 
 
తనపై దాడి చేసింది తనకు తెలియదని లక్ష్మోజీ చెబుతున్నాడు. అయితే, వైద్యం కోసం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరకుండా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతనిపై దాడి వ్యక్తిగత కారణాలా లేక రాజకీయ కక్షల కారణంగా జరిగిందా అనేది తెలియాల్సివుంది. ఈ దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే గుడివాడకు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.